హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన.. గుంతలోనే కూర్చొని ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన వ్యక్తి!
హైదరాబాద్‌లో రోడ్లపై గుంతల సమస్యకు నిరసనగా ఓ వ్యక్తి వినూత్న రీతిలో ఆందోళన చేపట్టాడు. నగరంలోని గౌలిగూడ ప్రాంతంలో రోడ్డు గుంతలోనే కూర్చొని తన నిరసనను వ్యక్తం చేశాడు.
రోడ్లపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళనకారుడు తన నిరసన ద్వారా తెలియజేశాడు. అధికారులు రోడ్ల మరమ్మతులపై వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశాడు.
“రోడ్డుపై గుంతనా.. లేక గుంతలో రోడ్డా?” అన్నట్టుగా కనిపించిన ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గుంతల కారణంగా ప్రమాదాల ముప్పు పెరుగుతోందని, సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు