BREAKING
ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు కర్ణాటకలో యాభై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్ తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు: ధ్వజారోహణంతో ప్రారంభమైన వైభవోత్సవం

కల్లెడ శివారులో చిరుతల కలకలం!

Select Suryaa Now
కల్లెడ శివారులో చిరుతల కలకలం!

పొలాల వైపు పరుగులు.. భయాందోళనలో గ్రామస్తులు – అప్రమత్తంగా ఉండాలని సూచనలు
సూర్య, మాక్లూర్: నిమాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ శివారులో చిరుత పులులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలాలు, పరిసర ప్రాంతాల్లో చిరుతల కదలికలు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
చిరుతల సంచారంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచిస్తున్నారు.
చిరుతల సంచారంపై అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి గ్రామ శివారులో గస్తీ పెంచాలని, కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.