BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

జివో 97ను తక్షణమే రద్దు చేయాలి

Select Suryaa Now
జివో 97ను తక్షణమే రద్దు చేయాలి

బీఆర్ఎస్ కేవీ నేత యాద క్రాంతి హెచ్చరిక
హైదరాబాద్: బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు, హైదరాబాద్ జిల్లా నాయకుడు యాద క్రాంతి ఆధ్వర్యంలో ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వివాదాస్పద జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా యాద క్రాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ ప్రయోగానికి విద్యార్థుల నుంచి ఆదరణ కరువైందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా స్కిల్ యూనివర్సిటీలో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోకపోవడాన్ని తట్టుకోలేక, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును బలితీసుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే జీవో 97ను వెనక్కి తీసుకోకపోతే, విద్యారంగంపై అవగాహన లేని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు విశాల్, ప్రశాంత్, నితీష్, నవీన్, కిరణ్, బంటి తదితరులు పాల్గొన్నారు.