BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్!

Select Suryaa Now
రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్!

రేవంత్ సర్కార్‌కు వెయ్యి రోజులు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక మైలురాయిని చేరుకుంది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2026 నాటికి 1,000 రోజుల పాలనను పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తన పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకొస్తోంది.

రైతులకు పెద్దపీట..

రైతు సంక్షేమంలో భాగంగా రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ ద్వారా 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రythు భరోసా కింద కూడా భారీగా నిధులు అందించినట్లు తెలిపింది.

మహిళలు, యువతపై ఫోకస్!

మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం కార్యాలయం పేర్కొంది. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

ఆర్థిక వృద్ధిపై సర్కార్ నజర్..

2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపింది.

అటు BRS.. ఇటు కాంగ్రెస్!

రేవంత్ సర్కార్ 1,000 రోజుల పాలన పూర్తయిన వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రభుత్వం తన విజయాలను ప్రచారం చేస్తుండగా.. BRS మాత్రం హామీల అమలు, ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యేక కార్యక్రమాలతో ప్రభుత్వంపై విమర్శలు చేయాలని BRS ప్రకటించింది.

వెయ్యి రోజుల పాలన.. ఇక ముందు ఏంటి?

1,000 రోజుల మైలురాయి దాటిన రేవంత్ సర్కార్‌కు ఇక మిగిలిన కాలం మరింత కీలకం కానుంది. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎంత మేరకు చేరాయి? పెండింగ్ హామీలు ఎప్పుడు నెరవేరుతాయి? అనే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చగా మారుతున్నాయి.