BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ

చిట్లంకుంట: చిట్లంకుంట, పాదర మండలం జిబిఆర్ చారిటబుల్ ట్రస్ట్ గువ్వల అమల ప్రత్యేక చొరవతో చిట్లంకుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ మరియు స్టేషనరీ కిట్లను పంపిణీ చేశారు.

అచంపేట నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్లను అందించాలనే సంకల్పంతో శ్రీమతి గువ్వల అమల గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం కల్పించడంతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై విద్యా ఖర్చుల భారాన్ని కొంతవరకు తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కె. పరమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ గారు, ఉపాధ్యాయులు, రాజేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు కొనసాగించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు.