BREAKING
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ టఫ్.. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుంటే రూ.1,000 ఫైన్! పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం TG EAPCET ఫార్మసీ కౌన్సెలింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 12 నుంచే రిజిస్ట్రేషన్! జివో 97ను తక్షణమే రద్దు చేయాలి తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచే వర్షాకాల సమావేశాలు! కొత్త మున్సిపల్ చట్టంపై ఉత్కంఠ సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ హైదరాబాద్‌లో గోల్ఫ్ టోర్నమెంట్‌కు తెరలేచింది.. నేటి నుంచే తెలంగాణ గోల్కొండ మాస్టర్స్.. రూ.1 కోటి కోసం స్టార్ గోల్ఫర్ల పోటీ! కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్! తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ వెండి ధరలకు స్వల్ప బ్రేక్.. సెప్టెంబర్ 1న కిలో వెండి రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు!

నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా

Select Suryaa Now
 నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా

నర్సాపూర్ పట్టణ బీజేపీ కన్వీనర్ గా గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ 
నర్సాపూర్:నర్సాపూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ  కన్వీనర్‌గా గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ నియమిస్తు బీజేపీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్డాదాస్ మల్లేష్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. పార్టీపై నమ్మకంతో, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ప్రేమ్ కుమార్ యాదవ్ సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.

నూతన బాధ్యతలను స్వీకరించిన ప్రేమ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ బీజేపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రేమ్ కుమార్ యాదవ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘ సాని సురేష్,గుండం శంకర్, రాములు నాయక్, ఆంజినేయులు గౌడ్ తదితరులు ఫాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణ బీజేపీ కన్వీనర్‌గా గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.