బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష
బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్
నర్సాపూర్: భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో 2వ తేదీ బుధవారం నాడు బస్టాండ్ ఆపోజిట్ మెయిన్ రోడ్ పై 22ఎ భూ సమస్యలపై బీజేపీ మెదక్ జిల్లా శాఖ భూములను కాపాడేందుకు భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన దీక్ష చేపట్టడం జరగనున్న సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
జిల్లా అధ్యక్షుల మాట్లాడుతూ 22ఎ పేరుతో సామాన్య ప్రజల తమ సొంత భూములను అమ్ముకోలేక రిజిస్ట్రేషన్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్దోషులైనా భూయాజమానులకు న్యాయం చేయాలి. తప్పుగా 22ఎలో చేరిన భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.
ఈ నిరసన దీక్షకు రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు గారు కేంద్ర మంత్రివర్యులు మరియు ఎంపీలు ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. ప్రతి మండలం నుండి రైతులను పెద్ద ఎత్తున ఈ దీక్షలో పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది. మెదక్ జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మోర్చాల అధ్యక్షులు సర్పంచులు కౌన్సిలర్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసని సురేష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రమేష్ గౌడ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్ మోర్చాలా అధ్యక్షులు సత్యనారాయణ రాములు నాయక్ మండల అధ్యక్షులు నీలి నగేష్ ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు గుండం శంకర్ మహిళా మోర్చా నాయకులు మౌనిక ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నగేష్ గౌడ్ బీజేవైఎం ప్రేమ్ అనీల్ మైనారిటీ మోర్చా జిల్లా జీఎస్ గౌస్ పాషా బీజేపీ నాయకులు కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.