సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్
నర్సాపూర్ లో భూగర్భ మురికి కాలువలు ఏర్పాటు చేసారు. ఇందుకు గాను రోడ్లను త్రవ్వడం జరిగింది. వాటిపై తిరిగి సిమెంట్ రోడ్లు వేస్తున్న క్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ పర్యవేక్షించారు, ఈ సందర్బంగా కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ ఏవిధమైన నాణ్యత లోపిస్తే సహించబోను అని, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయ్యాలి అని ఆదేశించారు. ఈ రోజు 13వ వార్డులో గల ప్రధాన రహదారి నుండి పోలీస్ స్టేషన్ వరకు గల రోడ్ వేయడం జరిగింది. కాంట్రాక్టర్ ఎటువంటి పొరపాట్లు చేయకుండా నాణ్యమైన మెటీరియల్ వాడి రోడ్లు వెయ్యాలని సూచించారు.లేనిపక్షాన బిల్లులు ఆపాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.