BREAKING
హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన.. గుంతలోనే కూర్చొని ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన వ్యక్తి! కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్‌ ఆందోళనలు సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు – హరీశ్‌రావు, కేటీఆర్‌ హాజరు కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి కీలక పిలుపు.. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు తెలంగాణలో నిరసనల వేడి! మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తా మంత్రి శ్రీధర్ బాబు సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలి : జిల్లా అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, ఎబివిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా ఇంటింటికీ టీడీపీ సంక్షేమంపై అవగాహన లబుషేన్‌కు షాక్.. ఆస్ట్రేలియా వన్డే జట్టు నుంచి ఔట్! కల్లెడ శివారులో చిరుతల కలకలం! జియో vs ఎయిర్‌టెల్‌.. ఏడాది వ్యాలిడిటీ వాయిస్‌ ప్లాన్లలో ఏది బెస్ట్‌? బంగారం ధరలకు బ్రేకులు లేవా? మైనింగ్ కంపెనీల లాభాలపై WGC కీలక అంచనా నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్ వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు కరెంట్ బిల్లు జీరో! 200 యూనిట్లలోపు వాడుతున్నారా? ఈ నెల మీ ఇంటి బిల్లు ఎంత వచ్చిందో చెక్ చేయండి! మహిళలకు ఫ్రీ బస్సు.. తెలంగాణలో సరికొత్త రికార్డు! 200 కోట్లకు పైగా ట్రిప్పులు.. అసలు కారణం ఇదే!

కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్‌ ఆందోళనలు సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు – హరీశ్‌రావు, కేటీఆర్‌ హాజరు

Select Suryaa Now
కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్‌ ఆందోళనలు సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు – హరీశ్‌రావు, కేటీఆర్‌ హాజరు

సూర్య కరీంనగర్ ప్రతినిధి:

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్‌ నాయకులు ఆరోపించారు. కేటీఆర్‌ పిలుపుమేరకు సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు కరీంనగర్‌ నియోజకవర్గంలో వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన కరీంనగర్‌లో జరిగిన సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండూరు రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తామని గంగుల పేర్కొన్నారు.సెప్టెంబర్‌ 3న హరీశ్‌రావు, 5న కేటీఆర్‌ హాజరుకానుండగా.. 22ఏ భూముల సమస్య, విద్యార్థులు, యువత, వృద్ధులు, వికలాంగుల సమస్యలపై ర్యాలీలు, నిరసనలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లో ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించనున్నారు.సమావేశంలో చల్ల హరిశంకర్, పొన్నం అనిల్‌కుమార్‌ గౌడ్, పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, సర్దార్‌ రవీందర్‌సింగ్తో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.