BREAKING
వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం.. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్! చేవెళ్లలో విద్యార్థుల గళం..! కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు కీలక తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట! ఘనంగా జగ్గా రెడ్డి కుమారుడి వివాహం పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం– కలెక్టర్ ప్రతీక్ జైన్ భారత్ ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్.. అంచనాలను మించి దూసుకెళ్లిన GDP వృద్ధి! ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులు వేగవంతం చేయాలి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు సీఎం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రధాన కార్యదర్శి అంగడి చిట్టంపల్లి-లాల్ పాడ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన.. గుంతలోనే కూర్చొని ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన వ్యక్తి! కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్‌ ఆందోళనలు సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు – హరీశ్‌రావు, కేటీఆర్‌ హాజరు

విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము

Select Suryaa Now
విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము

విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము 

ట్రాన్స్ కో హుజూరాబాద్ 132/11 స‌బ్ స్టేష‌న్ ప‌రిధిలో ప్ర‌మాద‌వ‌శాత్తు మృతిచెందిన గ్రేడ్ -2  ఉద్యోగి శంక‌ర్ రెడ్డి  సతీమణి బోడ స్వాతికి మంగ‌ళ‌వారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందించారు. హుజూరాబాద్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న శంకర్ రెడ్డి 2025 అక్టోబర్ 1న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స‌తీమ‌ణి బోడ స్వాతికి రూ.కోటి ప్రమాద బీమా మొత్తానికి సంబంధించిన చెక్కును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగాఅందించారు. ఈ సంద‌ర్భంగా బోడ స్వాతితో మాట్లాడుతూ కుటుంబ వివ‌రాలు తెలుసుకున్నారు. ఆర్థిక ప‌రిస్థితి, పిల్లల చ‌దువులు ఇత‌ర వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ బీమా సొమ్ముతో పిల్ల‌ల‌ను బాగా చ‌దివించాల‌ని చెప్పారు.

విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న రూ.కోటి ప్రమాద బీమా పథకం మొదట సింగరేణి సంస్థలో ప్రారంభమై, ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో అమలవుతోంది. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించే ఈ ప్రమాద బీమా పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ట్రాన్స్‌కో అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.