చిట్కుల్ కాంగ్రెస్ నేతలు హరీశ్‌రావుతో భేటీ
చిట్కుల్ కాంగ్రెస్ నేతలు హరీశ్‌రావుతో భేటీ
త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం.. పటాన్‌చెరు రాజకీయాల్లో చర్చ
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావును కోకాపేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్‌ఎస్ పటాన్‌చెరు మండల ఇన్‌చార్జ్ గడీల శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్‌తో కలిసి ఈ భేటీ జరిగింది.అనంతరం నాయకులు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కూడా కలసి చిట్కుల్ అభివృద్ధి, స్థానిక సమస్యలు, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు.చిట్కుల్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సంకేతాలు వెలువడటంతో పటాన్‌చెరు రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.