BREAKING
హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐసీసీ) లో ఘనంగా సీపీఎస్ విద్రోహ దినం.

Select Suryaa Now
సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐసీసీ) లో ఘనంగా సీపీఎస్ విద్రోహ దినం.

సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐసీసీ) లో ఘనంగా సీపీఎస్ విద్రోహ దినం.

సంగారెడ్డి, :సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐసీసీ) లో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సీపీఎస్ విద్రోహ దినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.టీజీఈజేఏసీ చైర్మన్ మొహమ్మద్ జావేద్ అలీ, సెక్రటరీ జనరల్ డా. వైద్యనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులు తమ వేతనాల నుంచి సంవత్సరాల తరబడి చెల్లించిన మొత్తానికి భద్రత కల్పించడంతో పాటు, పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడిపే విధంగా పెన్షన్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని నాయకులు కోరారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ లో ఉన్న డీఏలు, పీఆర్సీ అమలు కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ఉద్యోగులు ఐక్యంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెక్రెటరీ వేల్పూరు రవి, అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, టీఎన్జీఎస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నిర్మల రాజకుమారి, హెచ్.డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, రాష్ట్ర పంచాయితీ కార్యదర్శుల అధ్యక్షులు బలరాం, టీజీవో సెక్రెటరీ సంతోష్,తాలూకా అధ్యక్షులు ప్రమోద్ కుమార్, యాదవ్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాయిలు, సోమశేఖర్, 4వ తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్,వివిధ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.