telanagana
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి మానవీయ కోణంలో సేవలు అందించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.కమిషన్ సభ్యుడు రాంబాబు నాయక్తో కలిసి ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితెతో పాటు వివిధ శాఖల అధికారులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలుపై సమీక్ష నిర్వహించారు.అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని బక్కి వెంకటయ్య సూచించారు. అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల సివిల్ రైట్స్ డే, మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు.కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో కామన్ మెనూ అమలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఉపకార వేతనాలు, అంబేద్కర్ ఓవర్సీస్, కులాంతర వివాహాల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.ఎస్పీ మహేష్ బి. గితె మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్వో జయశ్రీ, ఆర్డీఓ కే.ఎస్.బీ. కుమారి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి, సంగీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.