BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కరణం ప్రహ్లాద్ రావు

Select Suryaa Now
బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కరణం ప్రహ్లాద్ రావు

 

కుల్కచర్ల: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తులు దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం ప్రహ్లాద్ రావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం కుల్కచర్ల బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు, భిన్నాభిప్రాయాలు సహజమేనని, కానీ పార్టీ కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. దాడికి బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులతో బీజేపీ గొంతును నొక్కలేరని, బెదిరింపులకు కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ వెంకయ్య గౌడ్, డాక్టర్ జానకిరామ్, గాదె మహిపాల్, సౌమ్యారెడ్డి, వర్వాళ్ల అంజిలయ్య, బ్యాగారి శ్రీనివాస్, గడుసు మహిపాల్, సురేందర్ గౌడ్, బిజ్జారం రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.