ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు.. కొత్త సోలార్ పాలసీ ప్రారంభం!
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన'ను ఢిల్లీలో మరింత వేగవంతం చేసేందుకు గానూ కొత్త 'ఢిల్లీ సౌరశక్తి విధానాన్ని' (Solar Policy) అమల్లోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.
ఉచితంగా 3 కేడబ్ల్యూ (kW) సోలార్ సిస్టమ్
కొత్త సోలార్ పాలసీ ప్రకారం.. నెలకు 400 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే గృహాలకు ఎటువంటి ముందస్తు ఖర్చు లేదా రుసుము లేకుండా ఉచితంగా 3 కిలోవాట్ల (3 kW) రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
మార్చి 2027 నాటికి నగరంలోని 2,30,000 గృహాల పైకప్పులపై ఉచితంగా సోలార్ ప్లాంట్లను అమర్చడం. ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్ సబ్సిడీలు యథావిధిగా కొనసాగుతాయి. దీనివల్ల ప్రజలకు విద్యుత్ సబ్సిడీతో పాటు సౌర విద్యుత్ ద్వారాదన ఆదా అయ్యే డబ్బు రూపంలో రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యం నెరవేరాలంటే 'వికసిత్ ఢిల్లీ' ద్వారానే సాధ్యమవుతుందని, అందుకే ఈ ఉచిత సోలార్ చొరవను వేగవంతం చేస్తున్నామని సీఎం తెలిపారు.