BREAKING
మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ: విద్యార్థులతో సరదా ముచ్చట్లు డీఆర్డీవోలో రీసెర్చ్ ఉద్యోగాలు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026: విశేష్ శర్మ సంచలన విజయం ఐటీఆర్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు గడువు: వీరికి మాత్రమే వర్తింపు! సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్

భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి తిరునాళ

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి తిరునాళ

పామూరు, మేజర్ న్యూస్: మండలంలోని వగ్గంపల్లి గ్రామంలో గంగమ్మ తల్లి 17వ తిరునాళ్ల పసుపు కుంకుమ శ్రావణమాస తిరునాళ్ల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించగా, ఆదివారం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. తప్పెట్ల మేళతాళాలు, నిండుబిందెలతో మహిళలు సందడి చేశారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి, మంగళహారతులు సమర్పించారు. అనంతరం దేవస్థానం వద్ద పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.మధ్యాహ్నం అమ్మవారి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహక వ్యవస్థాపక ధర్మకర్త జాజుల గురవమ్మ ఆధ్వర్యంలో, ఆలయ కార్యనిర్వాహక సేవకులు జాజుల మాల్యాద్రి–మల్లేశ్వరి దంపతుల సహకారంతో పాటు గ్రామ పెద్దల సహకారంతో అన్నదానం చేపట్టారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, శ్రావణమాసం మహిళలకు ఎంతో ప్రాధాన్యమైన మాసమని, ఈ మాసంలో అమ్మవారి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా రమణయ్య, వెంకట నరసింహ, జంబు జయరాములు, డేగ నాగరాజు, జంబు వేణు, జంబు కృష్ణ, సీతనబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.