BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి

Select Suryaa Now
పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి

కాఠ్మండు, ఆగస్టు 30: ఆకస్మిక వరదలతో కష్టాల్లో ఉన్న నేపాల్‌కు అండగా నిలిచేందుకు ఆధ్యాత్మిక గురువు సద్గురు నేతృత్వంలో నిర్వహించిన 'నేపాల్‌కు సంఘీభావం' (In Solidarity with Nepal) కార్యక్రమంలో ప్రముఖ నటి మనీషా కొయిరాలా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలకు భూతాపమే (గ్లోబల్ వార్మింగ్) ప్రధాన కారణమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు తలెత్తకుండా నివారించేందుకు భారత్, చైనా, నేపాల్ వంటి పొరుగు దేశాలు కలిసికట్టుగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
నేపాల్ అంటే కేవలం 'విపత్తుల దేశం' అనే ముద్ర పడకూడదని ఆమె ఆకాంక్షించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవనోపాధికి పర్యాటక రంగమే ఊపిరి లాంటిదని... అంతర్జాతీయ పర్యాటకులు నేపాల్ పర్యటనను కొనసాగించడం ద్వారా దేశాన్ని ఆదుకోవాలని కోరారు.

కష్టకాలంలో అంతర్జాతీయ సమాజం చూపుతున్న ప్రేమ, మద్దతు ఇలాగే కొనసాగాలని, ప్రతి ఒక్కరూ బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు రావలసిందిగా మనీషా కొయిరాలా విజ్ఞప్తి చేశారు.