BREAKING
అంబటి రాంబాబుకు గుండెపోటు: హైదరాబాద్‌ హాస్పిటల్‌లో స్టెంట్ చికిత్స విజయవంతం నేపాల్ వరదలు: ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులు గల్లంతు.. మరో ఇద్దరు సురక్షితం లక్నోలో వీరాంగన అవంతీ బాయి లోధీ విగ్రహావిష్కరణ.. ₹101 కోట్లతో మోడల్ కంటోన్మెంట్‌కు శంకుస్థాపన ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ! మహిళల హాకీ ప్రపంచ కప్ విజేతగా అర్జెంటీనా: నెదర్లాండ్స్‌పై ఘన విజయం వెంకటేష్ ‘AK47’ రిలీజ్‌పై కొత్త టాక్.. డేట్ మారనుందా? ఫ్యాన్స్‌లో పెరిగిన ఉత్కంఠ! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కెప్టెన్సీ మార్పుపై నోరు విప్పిన సూర్యకుమార్ యాదవ్: ఆ నిర్ణయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది నాని ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయే సాంగ్.. రిలీజ్‌తోనే వైరల్‌గా మారిన ‘యేశనగుల’! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 'ఆపరేషన్ సేఫెడ్ సాగర్' ఒక అద్భుతమైన ప్రాజెక్ట్: నటుడు సిద్ధార్థ్ ఇంటర్వ్యూ ఇరుముడి బాక్సాఫీస్ జోరు.. రవితేజ సినిమాకు తగ్గని క్రేజ్! నేపాల్ వరదలు: కాఠ్‌మాండూకు చేరిన నాల్గవ భారత సహాయక విమానం నాగార్జునసాగర్ నీటిపై మళ్లీ పంచాయితీ.. ఏపీ–తెలంగాణ మధ్య పెరిగిన టెన్షన్! టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో భారీ వరదల్లో 49 మంది భారతీయులు సహా 261 మంది విదేశీయుల సమాచారం కోసం గాలింపు

అంబటి రాంబాబుకు గుండెపోటు: హైదరాబాద్‌ హాస్పిటల్‌లో స్టెంట్ చికిత్స విజయవంతం

Select Suryaa Now
అంబటి రాంబాబుకు గుండెపోటు: హైదరాబాద్‌ హాస్పిటల్‌లో స్టెంట్ చికిత్స విజయవంతం
సూర్యా న్యూస్ బ్యూరో, గుంటూరు (ఆగస్టు 30):
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన స్టెంట్ చికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన అధికారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గుండెలో రెండు బ్లాక్‌లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని, వెంటనే స్పందించిన డాక్టర్ల బృందం దానికి స్టెంట్ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న అంబటి రాంబాబు ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో తనను కలవడానికి అభిమానులు, వైసిపి నాయకులు ఎవరూ కూడా హైదరాబాద్ రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల్లో తాను పూర్తిగా కోలుకుని గుంటూరు వస్తానని, అక్కడే అందరినీ కలుస్తానని స్పష్టం చేశారు.
జగన్ ఫోన్ కాల్ – పరామర్శ
అంబటి రాంబాబు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఫోన్ ద్వారా ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే పలువురు వైసిపి ముఖ్య నేతలు కూడా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.