BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

నెరవేరిన ఉత్తరాంధ్ర వాసుల కల ..తరలి వచ్చిన గోదారమ్మ నేడు లాచనంగా జలాలు విడుదల చేయనున్న చంద్ర బాబు

Select Suryaa Now
నెరవేరిన ఉత్తరాంధ్ర వాసుల కల ..తరలి వచ్చిన గోదారమ్మ  నేడు లాచనంగా జలాలు విడుదల చేయనున్న చంద్ర బాబు

(అనకాపల్లి జిల్లా - పాయకరావు పేట)

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ నుంచి నేడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు అఖండ జలహారతి ఇవ్వనున్న సీఎం

మొత్తంగా 2,87,320 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు

లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణానికి ఇప్పటివరకు మొత్తంగా రూ.4,192 కోట్ల వ్యయం

ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద నదులను దాటుకుంటూ ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలు

తూర్పు కనుమలను తొలచి, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ కెనాల్ నిర్మాణ పనులు

కాల్వ నిర్మాణంలో భాగంగా వివిధ నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు, అక్విడెక్టుల నిర్మాణం

కొన్నిచోట్ల నదీ ప్రవాహానికి ఎగువన.. ఇంకొన్నిచోట్ల దిగువ నుంచి కెనాల్ నిర్మాణం

ఏలేరు నది బెడ్ లెవల్ కు దిగువన గోదావరి జలాలను తరలించేందుకు సైఫన్ నిర్మాణం

పంపా నది ఎగువ నుంచి అక్విడెక్ట్ నిర్మించి పోలవరం ఎడమ కాల్వ ద్వారా మార్గం సుగమం

ఎడమ ప్రధాన కాల్వను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం

వేగంగా జరుగుతున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధాన పనులు

సమగ్ర ప్రణాళిక ద్వారా అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలకు గోదావరి జలాల తరలింపు

పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువప్రాంతాలకూ గోదావరి నీటి తరలింపు

భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు