BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు

Select Suryaa Now
భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు

 

బొంరాస్‌పేట్, దుద్యాల్ మేజర్ న్యూస్: దుద్యాల్ మండలం హంసన్‌పల్లి గ్రామంలో బుధవారం భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్వేయర్ మధుసూదన్, ఎమ్మార్వో కిషన్ నాయక్‌తో కలిసి మండల అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసి రైతులకు రీ-సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ల్యాండ్ సర్వే రికార్డుల ఏడీఏ మధుసూదన్ మాట్లాడుతూ భూభారతి రీ-సర్వే విధానం, భూముల కొలతలు, రికార్డుల నమోదు తదితర అంశాలను రైతులకు వివరించారు. రీ-సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని తెలిపారు.రైతులు తమ భూములకు సంబంధించిన రికార్డులు, వివరాలను ముందుగా పరిశీలించుకోవాలని, సర్వే నిర్వహించే సమయంలో అధికారులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.