BREAKING
రామాయంపేటలో రెండు ప్రెస్‌క్లబ్‌ల రద్దు త్వరలో పారదర్శకంగా ఎన్నికలు నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా సీపీఎస్‌ రద్దు చేసి.. ఓపీఎస్‌ పునరుద్ధరించాలి రిటైర్మెంట్‌ తర్వాత భద్రత కోసం నిరసన 23 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందం శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు అల్లరి నరేష్ కామెడీ కమ్ బ్యాక్ - రంభా ఊర్వశీ మేనక సెప్టెంబర్ 4న రిలీజ్! మేట్టూరు డ్యామ్ ఓపెన్ చేసిన సీఎం విజయ్ - కావేరీ మా హక్కే అంటూ కర్ణాటకకు వార్నింగ్! NEET గొడవకు సుప్రీం బ్రేక్ - విద్యార్థులపై FIR లు రద్దు - సెప్టెంబర్ 5 ర్యాలీ క్యాన్సిల్ - బాధితులకు పరిహారం బిష్కెక్ లో పాక్ కు మోదీ షాక్ - ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అంటూ వార్నింగ్! తిరుపతి సర్వదర్శనానికి ఎంత టైం పడుతుంది? ఈరోజు సెప్టెంబర్ 2 లేటెస్ట్ అప్డేట్ - వెళ్లే ముందు ఇది తప్పక తెలుసుకోండి! తిరుపతి లేటెస్ట్ అప్డేట్ - సెప్టెంబర్ 2న TTD సంచలన నిర్ణయం - బ్రహ్మోత్సవాల వేళ VIP దర్శనాలు బంద్! ఆంధ్ర & తెలంగాణలో ఈరోజు వెండి ధర - సెప్టెంబర్ 2 - షాకింగ్ డౌన్! తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ - సెప్టెంబర్ 2 కొత్త అప్డేట్ - ధరలు తగ్గాయా, పెరిగాయా? రేగోడ్‌లో ‘వన్ మోర్ టీ’ స్పెషల్

రామాయంపేటలో రెండు ప్రెస్‌క్లబ్‌ల రద్దు త్వరలో పారదర్శకంగా ఎన్నికలు

Select Suryaa Now
రామాయంపేటలో రెండు ప్రెస్‌క్లబ్‌ల రద్దు త్వరలో పారదర్శకంగా ఎన్నికలు

రామాయంపేటలో రెండు ప్రెస్‌క్లబ్‌ల రద్దు
త్వరలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల చారి
జర్నలిస్టుల సమస్యలపై పోరాడేది టీయూడబ్ల్యూజే మాత్రమే
రామాయంపేట,
రామాయంపేటలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొనసాగుతున్న రెండు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రెస్‌క్లబ్‌లను రద్దు చేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల చారి ప్రకటించారు. ఇకపై రామాయంపేటలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఒకే ప్రెస్‌క్లబ్ కొనసాగుతుందని తెలిపారు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి అనుమతితో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వెల్లడించారు.
మంగళవారం రామాయంపేట పట్టణంలోని ప్రగతి రిసార్ట్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే రామాయంపేట ప్రెస్‌క్లబ్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నది టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మాత్రమేనని అన్నారు.
జర్నలిస్టుల హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో పనిచేసేలా ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన జర్నలిస్టులకు సమస్య ఎదురైనా రాష్ట్ర, జిల్లా కమిటీల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలోనూ టీయూడబ్ల్యూజే కీలక పాత్ర పోషించిందన్నారు. ఇంకా అక్రిడేషన్ పొందని అర్హులైన జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్‌లు
జిల్లాలోని అనేక మండలాల్లో జర్నలిస్టులకు ఫ్లాట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందించినప్పటికీ నిజాంపేట, నార్సింగ్, మాసాయిపేట, చిలప్‌చెడ్, అల్లాదుర్గ్, టేక్మాల్, రేగోడు తదితర మండలాల్లోని పలువురు జర్నలిస్టులకు ఇంకా లబ్ధి చేకూరలేదని శంకర్ దయాల చారి తెలిపారు.
ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించి జర్నలిస్టులకు ప్లాట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మెదక్‌లో జర్నలిస్టుల వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఏర్పాటు చేసిన విధంగా మెదక్ జిల్లాలోనూ జర్నలిస్టుల కోసం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా టీయూడబ్ల్యూజే సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస శర్మ, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బొందుగుల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు పాతూరి రమేష్ గౌడ్, జిల్లా కోశాధికారి వూడెం దేవరాజు, రామాయంపేట ప్రెస్‌క్లబ్ మాజీ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం, మాజీ ప్రధాన కార్యదర్శి పటేరి రాము, మాజీ కోశాధికారి తుజాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు ప్రకాష్, శ్రీనివాస్, యూనియన్ నాయకులు అమరేందర్ రెడ్డి, బల్ల యాదగిరి, బొంతల సత్యనారాయణ, రంగా రాజాకిషన్, కర్రె నరేందర్, తుడుం పెంటయ్య, కుస్తీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.