BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించండి

Select Suryaa Now
మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించండి

మంత్రి శ్రీధర్ బాబును కోరిన ఎంసీ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్

శామీర్ పేట,మేజర్ న్యూస్ (సెప్టెంబర్01)

నూతనంగా ఏర్పడిన మూడు చింతలపల్లి  మున్సిపాలిటీ కి జిల్లా ఖనిజ అభివృద్ధి (గనులు) సంస్థ నుండి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మంగళవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లో నిధులు లేక  ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మున్సిపాలిటీలో నిధుల కొరత అధికంగా ఉండడంతో మునిసిపల్ సాధారణ నిధులు జీతాలకే సరిపోవడం లేదని, కావున మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని,ప్రజలకు మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు,డ్రైనేజ్, తాగునీరు, వీధిదీపాల అభివృద్ధి,నిర్వహణకు మున్సిపాలిటీలోని 24 వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన భాగంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా ఖనిజ అభివృద్ధి (గనులు) సంస్థ నుండి నిధులు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.