BREAKING
సేవాభావం, అంకితభావంతో కూడిన మోదీ ప్రస్థానం ఫెడ్ రేట్ల పెంపుతో పుంజుకున్న ఆసియా మార్కెట్లు మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా బీజేపీ 'సేవా సంకల్ప అభియాన్' సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట!

లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా

Select Suryaa Now
లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా

సూర్య మందమర్రి: సింగరేణి మందమర్రి ఏరియా నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూ ప్రగతి సాధిస్తోందని ఏరియా జీఎం ఎన్‌. రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టులో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 105 శాతం, ఓబీ తొలగింపులో 102 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఆర్కేపీ ఓసీ విస్తరణకు ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ ప్రక్రియ వేగవంతమైందని, పెద్దనపల్లి వద్ద 150 ఎకరాల భూసేకరణ కొనసాగుతోందన్నారు. దుబ్బగూడం నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, సీఎంపీఎఫ్‌, పెన్షన్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు రూ.7.5 కోట్లతో హైటెక్‌ కిచెన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏరియా అభివృద్ధికి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యూనియన్‌ ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్‌) సీహెచ్‌. అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్‌ కుమార్, సీనియర్‌ పర్సనల్‌ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.