BREAKING
లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా సీపీఎస్‌ రద్దు చేసి.. ఓపీఎస్‌ పునరుద్ధరించాలి రిటైర్మెంట్‌ తర్వాత భద్రత కోసం నిరసన 23 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందం శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు అల్లరి నరేష్ కామెడీ కమ్ బ్యాక్ - రంభా ఊర్వశీ మేనక సెప్టెంబర్ 4న రిలీజ్! మేట్టూరు డ్యామ్ ఓపెన్ చేసిన సీఎం విజయ్ - కావేరీ మా హక్కే అంటూ కర్ణాటకకు వార్నింగ్! NEET గొడవకు సుప్రీం బ్రేక్ - విద్యార్థులపై FIR లు రద్దు - సెప్టెంబర్ 5 ర్యాలీ క్యాన్సిల్ - బాధితులకు పరిహారం బిష్కెక్ లో పాక్ కు మోదీ షాక్ - ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అంటూ వార్నింగ్! తిరుపతి సర్వదర్శనానికి ఎంత టైం పడుతుంది? ఈరోజు సెప్టెంబర్ 2 లేటెస్ట్ అప్డేట్ - వెళ్లే ముందు ఇది తప్పక తెలుసుకోండి! తిరుపతి లేటెస్ట్ అప్డేట్ - సెప్టెంబర్ 2న TTD సంచలన నిర్ణయం - బ్రహ్మోత్సవాల వేళ VIP దర్శనాలు బంద్! ఆంధ్ర & తెలంగాణలో ఈరోజు వెండి ధర - సెప్టెంబర్ 2 - షాకింగ్ డౌన్! తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ - సెప్టెంబర్ 2 కొత్త అప్డేట్ - ధరలు తగ్గాయా, పెరిగాయా? రేగోడ్‌లో ‘వన్ మోర్ టీ’ స్పెషల్ ఆభరణాల ప్రియులకు ఊరట పాలకుర్తి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన భరత్ సుమన్

23 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందం

Select Suryaa Now
23 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందం

 సూర్య మందమర్రి: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ చేపట్టిన ఉద్యమంలో 32 డిమాండ్లలో 23 డిమాండ్లపై యాజమాన్యంతో ఒప్పందం కుదరడం చారిత్రాత్మక విజయమని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం కేకే-5 గనిలో నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్‌ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భీమనాధుని సుదర్శన్, బీపీఎల్‌ బ్రాంచ్‌ కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడారు. పెర్క్స్‌పై ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అంశం, సింగరేణి లాభాల్లో కార్మికుల వాటాను దసరా నాటికి ప్రకటించేలా ఒప్పందం కుదిరిందన్నారు. మిగిలిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయాలని యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.గేట్‌ మీటింగ్‌కు పిట్‌ కార్యదర్శి గాండ్ల సంపత్ అధ్యక్షత వహించగా, ఏరియా నాయకులు సోమిశెట్టి రాజేశం, పెద్దపెల్లి బానయ్య, టేకుమట్ల తిరుపతి, పిట్‌ కార్యదర్శి సీహెచ్‌పీ శర్మ, వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ సింగ్, పిట్‌ నాయకులు పంగ చంద్రశేఖర్, ప్రేమ్‌లాల్, సట్ల కొండయ్య, కాసం సమ్మయ్య, భగవాన్‌రెడ్డి, హేమచందు, ఊరుకొండ శ్రీకాంత్, గుగ్లోత్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు.