BREAKING
కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు కర్ణాటకలో యాభై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

Select Suryaa Now
రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

"కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి నీకు ఉందా?"
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ రాజీనామా చేస్తే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు.

కేసీఆర్‌కు రాజీనామాలు చేయడం కొత్తేమీ కాదని, ఆయన ఒకసారి రాజీనామా విసిరితే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో కాంగ్రెస్ నాయకత్వానికి బాగా తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. "గతంలో కేసీఆర్ రాజీనామా దెబ్బకు మీ అగ్రనేత సోనియా గాంధీనే గజగజ వణికిపోయారు. అలాంటిది కేసీఆర్ గనక ఇప్పుడు రాజీనామా చేస్తే ఆ రాజకీయాఘాతాన్ని తట్టుకునే శక్తి నీకు ఉందా రేవంత్ రెడ్డి?" అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఖరిపై కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.