BREAKING
కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు

వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

Select Suryaa Now
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

న్యూఢిల్లీ: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి బృహత్తర అభివృద్ధి పనులతో పాటు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో వైఎస్సార్ పాలనపై చెరగని ముద్ర వేశారని స్మరించుకున్నారు. పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.

ఈ నివాళి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, హర్కర వేణుగోపాల రావుతో పాటు ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, పోరిక బలరామ్ నాయక్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.