BREAKING
ఔషధ భద్రతపై గుజరాత్ ఎఫ్‌డిసిఎ ఉక్కుపాదం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, జైరాం రమేష్‌లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 286 రోజుల రికార్డు సముద్ర ప్రయాణం తర్వాత థాయ్‌లాండ్‌లో అమెరికా యుద్ధ నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' లంగరు దుర్మార్గపు కాంగ్రెస్ పాలనను ప్రజా కోర్టులో ఎండగడతాం ….ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిజిటల్ బీమా, మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రారంభం ఏజెన్సీ కోర్టులకు ఆ అధికారం లేదు *గిరిజనేతరుల ఆస్తుల వివాదాలపై సుప్రీమ్ కోర్టు స్పష్టికరణ * సివిల్ కోర్టులే పరిష్కరించాలని తీర్పు జీ20 సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి భేటీలు హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం.. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ భారీ నిరసన.. ‘జన గంగ’తో ప్రజా ఉద్యమంగా మారిన నదీ పరిరక్షణ సెప్టెంబర్ 3 నుండి ఉక్రెయిన్, పోలాండ్‌లలో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన పరిపాలన, పౌరుల మధ్య ఐఐఎస్ అధికారులు కీలక వారధి భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారంపై సమీక్ష పులుల సంరక్షణకు జీవావరణాన్ని, మానవ అవసరాలను సమతుల్యం చేయాలి ‘భయం నుండి శాంతి వైపు ఛత్తీస్‌గఢ్ పరివర్తనకు ఎయిమ్స్ రాయ్‌పూర్ ప్రతీక’ మరికాసేపట్లో గోదావరి జలాల విడుదల

హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం.. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ భారీ నిరసన..

Select Suryaa Now
హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం..  మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ భారీ నిరసన..

 

సూర్య పెద్దపల్లి ప్రతినిధి:కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న “పోరుబాట” కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద భారీ నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు పెద్దపల్లి వ్యవసాయం మార్కెట్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతిబింబించేలా 420 హామీలతో రూపొందించిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటి అమలులో మాత్రం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు.రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు, నిరుద్యోగులతో పాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు నేటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు, ఆసరా పింఛన్లు, యువతులకు స్కూటీల హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలను వివరిస్తూ రూపొందించిన ‘బాకీ కార్డులను’ అనంతరం
పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.