BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

సుప్రీంకోర్టులో సంచలన కేసు - గ్రాహం స్టెయిన్స్ హత్య దోషి దారా సింగ్ కు విడుదల దొరుకుతుందా?

Select Suryaa Now
సుప్రీంకోర్టులో సంచలన కేసు - గ్రాహం స్టెయిన్స్ హత్య దోషి దారా సింగ్ కు విడుదల దొరుకుతుందా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్రాహం స్టెయిన్స్ హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 1999లో ఒడిశాలో ఆస్ట్రేలియా మిషనరీ గ్రాహం స్టెయిన్స్ ను, ఆయన ఇద్దరు చిన్న కొడుకులను సజీవ దహనం చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దారా సింగ్ అలియాస్ రవీంద్ర పాల్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.గత జులైలోనే సుప్రీంకోర్టు ఒడిశా ప్రభుత్వాన్ని ఒక నెలలోపు దారా సింగ్ రిమిషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఆ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టే ఈ కేసును విచారించబోతోంది.అసలేం జరిగింది?
1999 జనవరిలో ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో గ్రాహం స్టెయిన్స్ తన ఇద్దరు పిల్లలతో కలిసి కారులో నిద్రిస్తుండగా, దారా సింగ్ తన అనుచరులతో కలిసి కారుకు నిప్పు పెట్టాడు. ఈ దారుణం అప్పట్లో ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కేసులో దారా సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.ఇప్పుడు 27 ఏళ్లుగా జైలులో ఉన్న దారా సింగ్ తనను విడుదల చేయాలని కోరుతున్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.