జమ్మూ కాశ్మీర్ లో హై టెన్షన్ - బీజేపీ ఆఫీసులకు JKNC ముట్టడి - రాష్ట్ర హోదా కోసం భారీ ధర్నా!
కాశ్మీర్ లో మళ్లీ రాజకీయ వేడి - బీజేపీ vs JKNC మధ్య మాటల యుద్ధం!జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర హోదా కోసం అధికార పార్టీ JKNC ఈరోజు భారీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో శ్రీనగర్, జమ్మూలోని బీజేపీ ఆఫీసుల చుట్టూ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.అసలు ఏం జరుగుతోంది?బీజేపీ నిన్ననే 'సెక్రటేరియట్ ముట్టడి' కార్యక్రమాన్ని ప్రకటించింది. ఉద్యోగాలు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ లక్ష్యం అని బీజేపీ చెబుతోంది.దీనికి కౌంటర్ గా JKNC పార్టీ కూడా రంగంలోకి దిగింది. పార్లమెంటులో, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తూ, బీజేపీ ఆఫీసులను శాంతియుతంగా ముట్టడిస్తామని JKNC ప్రకటించింది.దీంతో రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితి మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ కార్యాలయాల దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.