కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.
సూర్య నేరడిగొండ. : బోథ్ సోనాల మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పంపిణీ చేశారు. బోథ్ మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలోబోథ్ మండలానికి చెందిన 17 మంది లబ్ధిదారులు, అలాగే సోనాల మండలానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు హార్థిక భరోసా కల్పించడంలో కళ్యాణ లక్ష్మి పథకం కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు వివాహ ఖర్చుల భారం తగ్గించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను ప్రారంభించారని తెలియజేశారు. ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అరులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, సర్పంచులు రాజు రెడ్డి,రూప్ చంద్, సంజయ్, బాబూలాల్, అంబాజీ మాజీ సర్పంచ్ సురేందర్, విడిచి చైర్మన్ పోతన్న, పట్టణ అధ్యక్షులు ప్రశాంత్, యూత్ అధ్యక్షులు ప్రవీణ్,నాయకులు రాకేష్ రెడ్డి, సంజీవ్, రఫీ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు