కడవేరుగులో ఘనంగా అమ్మవారికి కుంకుమ పూజ
కడవేరుగులో ఘనంగా అమ్మవారికి కుంకుమ పూజ
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు
కడవేరుగు: చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పూజ తదనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరింఛి అమ్మవారి ఆశిస్సులు పొందారు. ఈ కార్యక్రమాన్ని యూత్ అసోసియేషన్ సభ్యులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.