ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.
మహిళా పోలీసు సిబ్బందితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్.
సూర్యాపేట క్రైమ్ మేజర్ న్యూస్
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మహిళా పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు చిన్నారుల సమక్షంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. నరసింహ ఐపీఎస్ ఉత్సవాలను ప్రారంభించి, మహిళా పోలీసు సిబ్బందితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మహిళా పోలీసు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని ఇలాంటి వేడుకలు సిబ్బంది మధ్య ఆత్మీయతను ఐక్యతను మరింత పెంపొందిస్తాయని తెలిపారు. పోలీస్ సిబ్బంది అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని, పరస్పర సహకారంతో విధులు నిర్వహిస్తూ సంతోషంగా జీవించాలని ఎస్పీ ఆకాంక్షించారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. మహిళా పోలీసు సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడంతో జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరఫున జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి బతుకమ్మ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా జీవించాలని కోరారు.
ఈ కార్యక్రమం నందు అడ్మినిస్ట్రేటివ్ అధికారి మంజు భార్గవి, డిఎస్పి నరసింహ చారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, జానయ్య, మహిళా సూపరింటెండెంట్ లు సబితా రాణి, శ్రీదేవి, మహిళా ఎస్ఐ లు ఝాన్సీ రాణి, తేజస్విని, మహిళా సిబ్బంది అరుణ, కవిత, జ్యోతి, పోలీసు సంఘం అధ్యక్షులు రమేష్, సెక్రెటరీ కిరణ్, సంఘం సభ్యులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.