బియ్యం లారీని అడ్డగించి డబ్బుల డిమాండ్ చేసిన విలేకరులు
సూర్య కామారెడ్డి ప్రతినిధి:బాన్సువాడలో కొందరు విలేకరులు తమ వాహనాలకు ‘ప్రెస్’ అని రాసుకొని బియ్యం, ఇసుక లారీలను అడ్డగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున నారాయణఖేడ్ నుంచి నిజాంసాగర్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్న బియ్యం లారీని అడ్డగించి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరుకోవడంతో లారీ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు లారీతో పాటు సంబంధిత విలేకరులను ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.