అనాథ పిల్లలతో పుట్టినరోజు వేడుకలు
అగపే ఆశ్రమంలో అన్నదానం.. మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్‌రెడ్డి
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25) : పుట్టినరోజు వేడుకలను అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పోచారం మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో ఉన్న అగపే అనాథాశ్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆకిటి శైలజతో కలిసి దంపతులు చిన్నారులకు స్వయంగా అన్నం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు.అనంతరం పిల్లలతో కొంతసేపు ముచ్చటించి ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పుట్టినరోజును సేవా కార్యక్రమంతో జరుపుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ లంబ రాజు