telanagana
అబ్దుల్ కలాంకు నివాళులర్పించిన ఏనుగు మచ్చేందర్ రెడ్డి
ఘట్కేసర్, మేజర్ న్యూస్(అక్టోబర్, 15):భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అవుశాపూర్ గ్రామంలో ఆయన విగ్రహానికి బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగు మచ్చేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ శాస్త్ర సాంకేతిక రంగానికి కలాం అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ అవుశాపూర్ గ్రామ బూత్ అధ్యక్షుడు కాసుల వెంకటేష్ గౌడ్, చిలకమారి మహేశ్, మైనారిటీ నాయకుడు షేక్ సలీమ్, నరేశ్, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.