BREAKING
ఢిల్లీలో తీవ్ర కలకలం: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు CJP నేతల అరెస్ట్ బౌలర్ల కెరీర్లూ ప్రమాదంలో ఉన్నాయి": 250 పరుగులు కాపాడుకోలేకపోయిన భారత్‌పై గంభీర్ స్పందన అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు గన్నవరం విద్యార్థిని చిన్మయి.. అండర్‌–19 విభాగంలో ప్లస్‌ 70 కేజీల కేటగిరీలో ఎంపిక. భారీ దిగుమతులకు అనుమతి ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ధరలు విపరీతంగా పెరగడంతో పుతిన్ నుంచి డీజిల్ దిగుమతి భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు 80వేలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే. ఆర్థిక నివేదికల ఆధారంగానే నిర్దిష్ట ప్రగతి లక్ష్యాలు: సీఎం చంద్రబాబు ఆదేశం! తడ్కల్‌ లో కదం తొక్కిన రైతన్నలు ఆటోలో తరలిస్తున్న రేషన్ జొన్నలను గుర్తించిన అధికారులు.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు ఇథియోపియాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపు! సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అరటి పండ్ల పూజ. ఎన్కతల శనీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య హోర్ముజ్ జలసంధిలో భారీ ఎల్‌పీజీ నౌకపై ఇరాన్ దాడి నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగుల కోతకు రంగం సిద్ధం..

ఢిల్లీలో తీవ్రమైన విపక్షాల ఆందోళనలు: మధ్యాహ్నం పార్లమెంట్‌లో ఇండీ కూటమి భేటీ

Select Suryaa Now
ఢిల్లీలో తీవ్రమైన విపక్షాల ఆందోళనలు: మధ్యాహ్నం పార్లమెంట్‌లో ఇండీ కూటమి భేటీ

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసనలు వరుసగా నాలుగో రోజుకూ చేరాయి.

ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ (సంవిధాన్ సదన్) వేదికగా కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండీ (INDIA) కూటమి భాగస్వామ్య పక్షాల ఎంపీలు ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం తీరుపై, సీఈసీ రాజీనామా డిమాండ్‌పై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ భేటీ తలపెట్టారు.

ఈ సమావేశం ముగిసిన అనంతరం, ఇండీ కూటమి ఎంపీలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు భారీ ర్యాలీగా వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.