సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా ప్రకటన.. డైరెక్టర్‌గా బాహుబలి నటుడు
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. #SDT19 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్న సాయి దుర్గ తేజ్ ఈసారికూడా ఒక సరికొత్త వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
బ్లాక్‌బస్టర్ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. బాహుబలితో పాటు పలు ప్రముఖ చిత్రాలలో నటుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను, ఆ తర్వాత పాపులర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ ద్వారా దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ #SDT19 చిత్రం ద్వారా ఆయన పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సాయి దుర్గ తేజ్ బాడీ లాంగ్వేజ్ మరియు స్క్రీన్ పర్సనాలిటీకి పూర్తిగా సరిపోయేలా ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసి ఆయనను సరికొత్త అవతార్‌లో చూపించనున్నారు.
ఈ కథలోని ప్రత్యేకత, పాత్రలోని కొత్తదనం ఎంతగానో నచ్చడంతో సాయి దుర్గ తేజ్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారీ స్థాయి కమర్షియల్ హంగులతో పాటు బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మించడంలో దిట్ట అయిన నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాణ పరంగా అన్ని తకావతులతో కూడిన ఈ ప్రాజెక్ట్ సాయి దుర్గ తేజ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే, ఈ నెలలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రంలో నర్తించబోయే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. పండుగ వాతావరణంలో వెలువడిన ఈ అనౌన్స్మెంట్ సాయి దుర్గ తేజ్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.