BREAKING
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు అమెరికా ద్రవ్యోల్బణ సెగతో గరిష్ట స్థాయికి డాలర్: ఏడాది గరిష్టాన్ని తాకిన యూఎస్ డాలర్ ఇండెక్స్.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలే కారణం! కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… ఈయూ, ఐఎంఎఫ్ నుంచి కోట్ల నిధుల విడుదలకు కీలక చట్టాలు ఆమోదించిన ఉక్రెయిన్ అమెరికాలో నిరుద్యోగ భృతి దరఖాస్తుల్లో స్వల్ప పెరుగుదల గీతంలో ఘనంగా ప్రపంచ కూచిపూడి దినోత్సవం -"నాట్యోత్సవ్‌–2026"లో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు లెబనాన్ సైన్యం పట్టుకున్న పేలుడు పదార్థాలు తమవే...అంగీకరించిన హిజ్బుల్లా హెచ్‌పి హసన్ ఫడ్లల్లా

పండక్కి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ చూసే క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'క్రేజీ కల్యాణం': హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

Select Suryaa Now
పండక్కి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ చూసే క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'క్రేజీ కల్యాణం': హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం 'క్రేజీ కల్యాణం'. నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను, తన పాత్ర ప్రాధాన్యతను హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఈ సినిమాకు మొదట వేరే టైటిల్ అనుకున్నప్పటికీ, షూటింగ్ సమయంలో ప్రతి సన్నివేశం ఎంతో క్రేజీగా అనిపించడంతో దర్శకుడు 'క్రేజీ కల్యాణం'గా పేరు మార్చారని అనుపమ తెలిపారు. నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ వంటి టాలెంటెడ్ నటులు కాస్టింగ్‌లో భాగం కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకం అయిందని చెప్పారు. నిర్మాత జగన్ మోహన్ రెడ్డి అందించిన సహకారంతోనే ఈ చిత్రం అనుకున్న విధంగా తెరకెక్కిందని, పండుగ పూట ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి థియేటర్లలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ, పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు సంతోషంగా జీవించడానికి చేసుకునే బంధం కానీ, అమ్మాయిని ఇంట్లో పనిమనిషిగా మార్చేందుకు కాదనే బలమైన ఆలోచన ఉన్న కీర్తి పాత్రలో తాను కనిపిస్తానని అనుపమ వెల్లడించారు. ట్రైలర్‌లో చూపించినట్లుగా భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న సరదా సంఘటనలు, రిలేషన్షిప్ స్ట్రగుల్స్ ప్రేక్షకులకు ఎంతో రియలిస్టిక్‌గా అనిపిస్తాయని తెలిపారు. దర్శకుడు బద్రప్ప చెప్పిన స్క్రిప్ట్ నచ్చి తాను వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించానని, తెలంగాణ యాసలో సాగే ఈ కథలో కామెడీ ఎంతో సహజంగా పండిందని పేర్కొన్నారు.

నటుడిగా అఖిల్ ఎమోషనల్ హానెస్టీతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, అలాగే డాక్టర్ నరేష్ లాంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపించిందని అనుపమ తెలిపారు. తరుణ్ భాస్కర్ పోషించిన బాలరాజు పాత్ర మన ఇంట్లో మనిషిలా ఉంటూ విపరీతమైన వినోదాన్ని పంచుతుందని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా ఈ సినిమా చూసి ఎంతో అభినందించారని, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ చిత్రంలోని ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారని తెలిపారు. నటిగా ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలనే ఎంచుకోవాలని కోరుకుంటానని, క్రేజీ కల్యాణంలోని కీర్తి పాత్ర ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.