ఆ గాయం మాకు దొరికిన వరం".. విజయ్‌తో గడిపిన అరుదైన క్షణాలపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్!
"ఆ గాయం మాకు దొరికిన వరం".. విజయ్‌తో గడిపిన అరుదైన క్షణాలపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్!
పెళ్లి తర్వాత బిజీ షెడ్యూల్స్ కారణంగా ఒకరినొకరు సరిగ్గా కలుసుకోలేకపోయిన టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల గురించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ 'ఫిల్మ్‌ఫేర్' (Filmfare) ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు.
షూటింగ్ గాయమే మాకు కలిపింది!
‘మైసా’ (#Mysaa) సినిమా షూటింగ్ సమయంలో రష్మికకు స్వల్ప గాయమైంది. దీని కారణంగా ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ తప్పనిసరి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ రెస్ట్ పీరియడ్ తన జీవితంలో ఊహించని వరంగా మారిందని ఆమె భావోద్వేగంతో తెలిపారు. ఫిబ్రవరిలో వివాహం జరిగిన వెంటనే ఏర్పడిన బిజీ వర్క్ షెడ్యూల్స్ వల్ల తాము దాదాపు మూడు నెలల పాటు సరిగ్గా కలుసుకోలేకపోయినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.
ప్రతి అడుగులోనూ అండగా విజయ్:
ఈ రికవరీ సమయంలో విజయ్ దేవరకొండ తనకు ప్రతి అడుగులోనూ చేదోడు వాదోడుగా నిలిచారని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు. షూటింగ్ బిజీ నుంచి కొద్దిగా బ్రేక్ దొరకడంతో.. ఆ ఖాళీ సమయంలో ఇద్దరూ కలిసి ఎన్నో కొరియన్-డ్రామాలను చూస్తూ ఎంతో నాణ్యమైన సమయాన్ని (Quality Time) గడిపినట్లు వెల్లడించారు.
విజయ్ సరదా జోక్:
"ఇలాంటి విరామాలు భవిష్యత్తులోనూ తరచూ తీసుకుందాం.. కాకపోతే ఈసారి ఎలాంటి గాయాలు లేకుండా ఉంటే సరిపోతుంది" అంటూ విజయ్ తనతో సరదాగా జోక్ చేశారని రష్మిక నవ్వుతూ పంచుకున్నారు. మొత్తానికి, ఈ చిన్న విరామం తమకు ఒకరినొకరు మరింత దగ్గర కావడానికి చక్కని అవకాశం కల్పించిందని ఆమె తెలిపారు.