BREAKING
ఈసీబీ నాయకత్వ మార్పు వెనుక రాజకీయ చదరంగం కుల,మత రహిత సమాజమే భగత్‌సింగ్‌కు ఘన నివాళి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై దేశవ్యాప్తంగా మొదలైన తీవ్ర చర్చ కొందుర్గు పిఏసిఎస్ నూతన చైర్మన్ గా అనిత జితేందర్ రెడ్డి. యూకే ఎయిర్‌బేస్ వద్ద ఐదుగురి అరెస్ట్ ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తత కిసాన్ మోర్చా జిల్లా నూతన కమిటీ నియామకం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతం చేయాలి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి: ప్రతిపక్షాలకు మంత్రి వీరాంజనేయులు తీవ్ర హెచ్చరిక బ్రిటన్ బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణే కీలక ప్రాధాన్యం విజయవాడ దసరా ఉత్సవాలకు ఏఐ సాంకేతికతతో పటిష్ట నిఘా ఏర్పాట్లు: మంత్రి సత్యకుమార్ విద్య, ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం: భట్టి విక్రమార్క పింఛనుదారులకు గుడ్ న్యూస్‌ హోంగార్డుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కీసరగుట్టలో వైభవంగా పల్లకి సేవ

అంచనాలు పెంచేస్తున్న నితీష్ తివారీ రామాయణం పోస్టర్స్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్ లుక్స్ వైరల్

Select Suryaa Now
అంచనాలు పెంచేస్తున్న నితీష్ తివారీ రామాయణం పోస్టర్స్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్ లుక్స్ వైరల్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: భారతీయ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణం నుంచి మేకర్స్ వరుస అప్‌డేట్లతో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చుతున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మహాగాథలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తుండగా, రాకింగ్ స్టార్ యశ్ అత్యంత శక్తివంతమైన రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా లంకేశ్వరుడిగా యశ్ ధరించిన పవర్‌ఫుల్ అండ్ రాయల్ అవతార్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో యశ్ తన ఇంటెన్స్ లుక్‌తో ఫ్రేమ్‌ను పూర్తిగా డామినేట్ చేశారు. విలువైన రత్నాలు పొదిగిన మెరిసే బంగారు కిరీటం, పొరలుగా ఉన్న ముత్యాల హారాలు, భారీ బంగారు ఆభరణాలతో రావణుడి పాత్రకు తగిన రాజసం, గంభీరతను ఆయన అద్భుతంగా ఒడిసిపట్టారు. అపారమైన జ్ఞానం, శక్తి కలిగిన లంకా అధిపతిగా యశ్ పర్సనాలిటీ ఈ పోస్టర్‌లో ఎంతో హైలైట్‌గా నిలిచింది. మరోవైపు శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే అడవిలో వనవాస కాలంలో ప్రయాణిస్తున్న మరో కొత్త పోస్టర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ విజువల్స్ అన్నీ సినిమాలోని గ్రాండియర్‌ను కళ్లకు కట్టేలా ఉన్నాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఆస్కార్ అవార్డు గ్రహీత డిఎన్‌ఈజీతో పాటు యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుప్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రకటించిన విధంగానే రామాయణం పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుండగా, పార్ట్ 2 వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.