BREAKING
నెగెటివిటీనే నాలో కసి పెంచుతుంది.. ట్రోల్స్‌పై స్పందించిన పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు.. ఏఎం ఫార్స్టర్ క్లాసిక్ నవల ఆధారంగా అట్టహాసంగా ‘ఎ పాసేజ్ టు ఇండియా’ కౌన్సిలర్ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన కన్నడ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే? బాక్సాఫీస్ వద్ద రామాయణం మేజిక్.. పదమూడో రోజుకు ఎనిమిది వందల కోట్ల మార్కును దాటిన రణ్‌బీర్ కపూర్ చిత్రం ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన కార్యక్రమం సామాన్యులకు సాహిత్య మాధుర్యాన్ని చేరువ చేసేది సినిమాపాటే.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ! మూడు చింతలపల్లికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు ఫిలిప్పీాన్స్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా నెట్టింట వైరల్ అవుతున్న సమంత బేబీ షవర్ ఫొటోలు.. అసలు నిజం ఏంటంటే! ఆలూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి తాండూరు రూరల్ సీఐగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ క్యూ స్పోర్ట్స్ అద్భుత విజయాలతో టోర్నీని ఆరంభించిన పంకజ్ అద్వానీ, అనుపమ రామచంద్రన్ కవల పిల్లల జననం తర్వాత ఎన్నో కష్టాలు.. అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన ఉపాసన!

ఏడాది కనిష్టానికి పడిపోయిన బంగారం ధరలు

Select Suryaa Now
ఏడాది కనిష్టానికి పడిపోయిన బంగారం ధరలు

సూర్య బిజినెస్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోయి సరికొత్త కనిష్ట స్థాయిలను నమోదు చేస్తున్నాయి. అమెరికా డాలర్ బలపడటం మరియు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై నెలకొన్న అంచనాల కారణంగా బంగారం ధరలు గత ఒక సంవత్సరంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు దాదాపు 3,796 డాలర్ల దిగువకు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ మార్కెట్లలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. గతంలో గరిష్ట స్థాయిలను తాకిన పసిడి ధరలు ప్రస్తుతం భారీగా కరెక్షన్‌కు గురికావడం గమనార్హం.

అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో యూఎస్ సెంట్రల్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగే కొద్దీ ఎలాంటి రాబడిని ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తుండటంతో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలపడటం, ట్రెజరీ ఈయిల్స్ ఊపందుకోవడం పసిడి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మార్కెట్లో నగదు కొరతను అధిగమించేందుకు మదుపర్లు తమ వద్ద ఉన్న పసిడి నిల్వలను విక్రయించి లిక్విడిటీని పెంచుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈ పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ధరల తగ్గుదల కారణంగా దేశీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు దిగివస్తున్నాయి. అయితే ధరలు తగ్గుముఖం పట్టడంతో రాబోయే పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు మార్కెట్ వైపు చూసే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. స్వల్పకాలికంగా మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగినప్పటికీ, దీర్ఘకాలికంగా పసిడికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ధరలు స్థిరపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.