విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
విజయవాడ :విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా రేపు విజయవాడలో భారీ మెగా కార్నివాల్‌ను నిర్వహించనున్నారు. ఈ విశేష కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సుమారు 2 వేల మంది కళాకారులతో వివిధ సంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయగా, 38 రకాల కళారూపాలు మరియు అమ్మవారి అలంకారాలతో ప్రత్యేక రథాన్ని తీర్చిదిద్దారు. గత ఏడాది కంటే చాలా అట్టహాసంగా ఈ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నామని, వేడుకల్లో పాల్గొనే కళాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు. ప్రజలందరూ విశేష సంఖ్యలో తరలివచ్చి ఈ కార్నివాల్‌ను తిలకించాలని ఆయన పిలుపునిచ్చారు.