విజయమే ధ్యేయంగా ఎన్నికల పోరులో బరిలోకి...!
వైస్సార్సీపీ అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దువ్వాడ నానాజీ
ఎస్.రాయవరం, అక్టోబర్ 17, మేజర్ న్యూస్:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పోరుబాటలో ముందుకు వెళ్తుందని వైఎస్సార్సీపీ నాయకుడు, అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దువ్వాడ నానాజీ స్పష్టం చేశారు. శనివారం నాడాయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీని దెబ్బతీయాలని ఎవరు ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎంతమందిని రంగంలోకి దించినా తమ పార్టీ శ్రేణులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. జగనన్న ఆశయాల కోసం, ఆయన ఇచ్చిన పిలుపే ధ్యేయంగా పార్టీ జెండా కోసం చివరి వరకు పోరాడుతాం అని తెలిపారు.
ప్రతి చోటా ఒంటరి పోరాటమే!
ప్రతి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, ప్రతి మున్సిపల్ కౌన్సిల్, కార్పొరేషన్ డివిజన్ లో వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుతుందని ఆయన ఉద్ఘాటించారు. అనకాపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీ బలంగా ఉందని, బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గెలుపు లేదా ఓటమి అనేది ప్రజా తీర్పు. కానీ సమరంలో పోరాటం మాత్రం మేం ఆపబోం అన్నారాయన. పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ధైర్యంగా, గెలుపు పై నమ్మకంతో ముందుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీ పడటాన్ని చూస్తుంటే పరిస్థితి అర్థమవుతుందన్నారు. ఎన్నికల పోరుబాటలో ముందుకొచ్చే వారికి పార్టీ అండగా ఉంటుందని దువ్వాడ నానాజీ పిలుపునిచ్చారు.