విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు సాంకేతిక సదస్సులు వచ్చే విధంగా తయారు చేయండి
పులివెందుల మేజర్ న్యూస్:
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు సాంకేతిక సదస్సులు ఎంతగానో దోహదపడతాయని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అన్నారు. పట్టణంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం జాతీయస్థాయి సాంకేతిక సదస్సు ‘నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం–2026’ నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సుల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నిర్వహణ నైపుణ్యాలు, సమన్వయ సామర్థ్యం పెంపొందుతాయన్నారు. వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.
విశ్వవిద్యాలయ పరిశోధకుడు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపాలన్నారు. ‘ఇంధన వనరులు–గ్రిడ్ అనుసంధానం’ అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శేష మహేశ్వరమ్మ, ప్రొఫెసర్లు భానుప్రకాష్, హుస్సేన్, హోలీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా