BREAKING
సమతుల ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం పట్టభద్రులంతా విధిగా ఓటు నమోదు చేసుకోవాలి అమెరికా బందీల వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా జాన్ కోల్ నియామకం ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ అవార్డుపై అభినందనలు పోడు భూముల సమస్యలపై త్వరలో తీపి కబురు ...మంత్రి పొంగులేటి ఖాళీ ప్రదేశానికి ఏ విధంగా ఇంటి నెంబర్లు ఎలా ఇస్తారు బిజెపి పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ ఫ్లైదుబాయ్ కో-పైలట్ ఆస్ట్రేలియా సంబంధాలపై భద్రతా దళాల దర్యాప్తు రేపు సూడేపల్లిలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ మంత్రి తుమ్మలకు వేంసూరు రైతుల విజ్ఞప్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి 4 కోట్లతో... 3 తారురోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హౌతీల ఆధీనంలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలోకి 50 మంది చేరిక భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన హవనం

వైయస్సార్ సిపి పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ

Select Suryaa Now
వైయస్సార్ సిపి పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
*చాగలేరు,వి.కొత్తపల్లి గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టిన మండల కన్వీనర్, మాజీ జడ్పీటీసీ ,మాజీ ఎంపీపీ
వేముల మేజర్ న్యూస్::---వేముల మండలంలోని చాగలేరు,వి.కొత్తపల్లి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంను ఆదివారం సాయంకాలం వేముల మండల కన్వీనర్ నాగెళ్ళ సాంబశివరెడ్డి, వేముల మాజీ జడ్పీటీసీ కొకటం వెంకట బయపు రెడ్డి,మాజీ పిసిబి సభ్యులు మరక శివకృష్ణ రెడ్డి,మాజీ ఎంపీపీ చల్లా వెంకట నారాయణ చేపట్టారు.పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించడంతో పాటు, వారికి పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని పార్టీ అధినేత ఆధ్వర్యం లో చేపట్టినట్లు వారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, మాజీ జడ్పీటీసీ కొకటం వెంకట బయపురెడ్డి, మాజీ పీసీబీ డైరెక్టర్ మరక శివకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ చల్లా వెంకట నారాయణ,వైస్ ఎంపీపీ చందా మల్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలే పార్టీకి బలమని, వారి సేవలను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించడం పార్టీ బాధ్యతని పేర్కొన్నారు. కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రతి ఒక్కరు సమష్టి కృషి తో పోటీ చేసి గెలవాలని పిలుపును ఇచ్చరు.ప్రతి కార్యకర్తకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండగా ఉంటారని హామీ ఇచ్చారు.కార్యకర్తల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి కృషి చేస్తున్నారు అని, ఐడి పొందిన పార్టీ కార్యకర్తలు కమిటీ సభ్యులు ఎవరైన ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారని,ఈ ఐడీ కార్డు ఉన్న ప్రతి ఒకరు జగన్ అన్న సైనికులు అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు శాయశక్తుల కృషి చేయాలి అని అన్నారు.కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నడిపి మల్ రెడ్డి,మాజీ సర్పంచ్ శ్రీనివాసులు,గండి పాలకమండలి సభ్యులు పిబివి కొండారెడ్డి, రేడెయ్య, మాజీ ఉప సర్పంచ్ పోరెడ్డి రాఘవరెడ్డి,మాజీ ఎంపీటీసీ చంద్ర శేఖర్ రెడ్డి,కడప జిల్లా యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్,యువ నాయకులు పి బి వి భాస్కర్ రెడ్డి,హరి,వెంకట సుబ్బారెడ్డి,వెంకట స్వామి, అర్జున్,నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.