వైభవంగా ముగిసిన దేవరగట్టు ఉత్సవాలు
వైభవంగా ముగిసిన దేవరగట్టు ఉత్సవాలు
* నెరణికి గ్రామానికి చేరిన మాళమల్లేశ్వర స్వామి విగ్రహ మూర్తులు.. గ్రామంలో పండుగ వాతావరణం
హొళగుంద, సూర్య ప్రతినిధి:
హొళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఉత్సవాలు భాగంగా ఆదివారం స్వామివారి ఉత్సవ విగ్రహ మూర్తులు, పల్లకిలను భక్తులు నెరణికి గ్రామానికి చేర్చడంతో ఉత్సవాలు ముగిశాయి.ఈనెల 15వ తేదీన కంకణ ధారణతో ఉత్సవాలు మొదలయ్యాయి.ఈనెల 21వ తేదీన విజయదశమి బన్నీ ఉత్సవం ప్రధాన ఘట్టం.కర్రల ఉత్సవాలు ఉత్కంఠకు భరితంగా జరిగింది.అనంతరం స్వామివారి రథోత్సవం, గొరవయ్యల నృత్య ప్రదర్శనలు అత్యంత వైభవంగా జరిగాయి.ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి విగ్రహమూర్తులు పల్లకిలను గ్రామానికి చేర్చడంతో గ్రామంలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంది.గ్రామంలో ఇంటిల్లిపాదిగా భక్తులు స్వామివారి విగ్రహ మూర్తులకు నైవేద్యాలను సమర్పించి విగ్రహం మూర్తులను ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపుకు నిర్వహించారు. చిన్నపిల్లల పెద్దలు ఉత్సాహంగా కలిసికట్టుగా పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బంద బస్సు ఏర్పాటు చేశారు.
టి.ఉమాపతి సూర్య ప్రతినిధి.