వైభవంగా హోమాలు
విజయనగరం కల్చరల్, సూర్య : గాయత్రీ శ్రీ విద్యాపీఠం పూల్ భాగ్ లో శుక్రవారం 12 వేల కలువ పువ్వులు,, గులాబి పువ్వులతో మహాలక్ష్మీ కటాక్షం కోసం లోక కళ్యాణార్థం దేశంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ప్రకృతి సమతుల్యం కాంక్షిస్తూ ధనప్రాప్తి సిధ్ధించాలని, బ్రహ్మర్షి యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గురువర్యుల పర్యవేక్షణ లో, బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మీ హోమం, లక్షా పువ్వులతో లలితా సహస్ర హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కలకత్తా నుండి తామరాకు కలువ పువ్వులు రప్పించి లక్ష్మీ దేవి పారాయణం చేసి, లక్ష గులాబీ పూలతో లలితా సహస్ర హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ యాగంలో రుత్వికులు, యాగార్థులు, దంపతులు పరాశక్తి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గురువర్యుల అనుగ్రహ భాషణం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు విశిష్టత, మానవాళి మనుగడకు అవసరమైన సనాతన ధర్మం వేద పఠనం, యజ్ఞ యాగాలు ఆచరించిండం వలన అమ్మ వారి అనుగ్రహంతో ఉపద్రవాలు తొలగి సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. అందుకే దసరా ఉత్సవాలు దేశ వ్యాప్తంగా నివసిస్తున్నారు . ప్రతి ఒక్కరు కామ క్రోధ మోహ లోభ మద మాశ్చర్యాలకు దూరంగా ఉండటమే ఉత్తమం అని చెప్పారు
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.