BREAKING
21వ రోజుకు చేరిన వీఆర్ఏ ల సమ్మె 25 ఏళ్ల‌ ప్ర‌జా సేవా శిఖ‌రానికి న‌మో విద్యుత్ సేవా సేతు కార్యక్రమం.. అక్టోబరు 25న నటన, జానపద నృత్య పోటీలు ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే దిశగా మరో ముందడుగు మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక రోడ్డు ప్రమాదం లో గాయపడిన మహిళా చికిత్స పొందుతూ మృతి రూ.3 లక్షలకు నకిలీ బంగారం..! మినీ స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు కావడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం . సమస్యల పరిష్కరానికి వి ఆర్ ఏ లు చేస్తున్నా దీక్ష కు సి.పి.ఎమ్ సంఘీభావం దోమల నివారణకు గంబూసియా చేపలు... నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. డిసెంబర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్! లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల శివాని- మేఘశ్రీ -పార్థసాని చిన్నారులను ఆశీర్వదించిన *డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్* *పవన్ సాయి హాస్పిటల్ అధినేత* చిరు వ్యాపారులకు అండగా కేడీసీసీ బ్యాంక్ పెనుగంచిప్రోలులో 17 మందికి రుణ చెక్కుల పంపిణీ ఎలాంటి షూరిటీ లేకుండా రుణ సదుపాయం కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం హాజరు

తెలుగు సాహిత్యం విలువ వెలకట్టలేనిది

Select Suryaa Now
తెలుగు సాహిత్యం విలువ వెలకట్టలేనిది

 – ఏపీ సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి

 – ఏపీ ఎస్ఆర్ఎంలో ఘనంగా ప్రారంభమైన అమరావతి సాహిత్య ఉత్సవాలు

 – హాజరైన కవులు, రచయితలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థులు, సాహిత్యాభిలాషులు

ఏపీ సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

తెలుగు భాష, సాహిత్యం విలువ వెలకట్టలేనిదని, మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దే శక్తి తెలుగు సాహిత్యానికి ఉందని ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు అవసరమైన ప్రణాళికలతో సంస్కృతి కమిషన్ ముందుకు సాగుతోందని తెలిపారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి తేజస్వి పొడపాటి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, సాహిత్యాభిలాషులు, వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కవులు, రచయితలను ఉద్దేశించి ప్రసంగించారు. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సాహిత్య ఉత్సవాల వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తేజస్వి పొడపాటి మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో నేటితరం విద్యార్థులు ‘అక్షరం’ విలువను విస్మరిస్తున్నారని అన్నారు. సాహిత్య మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే అక్షరాన్ని ఆరాధించాల్సిన అవసరం ఉందని సూచించారు. విదేశీ భాషలపై ఆసక్తి పెంచుకుంటున్న క్రమంలో తెలుగు విద్యార్థులు మాతృభాషను విస్మరించకూడదని హితవు పలికారు. తెలుగు భాష, సాహిత్య విలువలను జాతీయ స్థాయిలో మరింత పెంపొందించే దిశగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. తెలుగు భాషా వికాసం, సాహిత్య విలువలను పెంచే దిశగా ఏపీ సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు పది మందికి పైగా ముఖ్యమంత్రులు హాజరుకానున్నారని వెల్లడించారు. *పుస్తక పఠనంతో ఆత్మవిశ్వాసం*.. విశిష్ట అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంతో పాటు సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. అమరావతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సాహిత్య ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. *కవులు, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యం*... యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల భాషలు, సాహిత్యాలను పరిమళింపజేస్తున్న కవులు, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడమే అమరావతి సాహిత్య ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించే సాహిత్య ఉత్సవాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రెండు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. పురస్కారాల ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హాజరైన తమిళనాడుకు చెందిన ప్రముఖ రచయిత్రి మినీ కృష్ణన్ సాహిత్య ఉత్సవాల ప్రాధాన్యత, సాహిత్యం సమాజంపై చూపే ప్రభావం గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ విష్ణుపథ్, సాహిత్య ఉత్సవాల కన్వీనర్లు డాక్టర్ ఆర్గాబసు, డాక్టర్ శయంతన్ ఠాగూర్ తదితరులు ప్రసంగించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తేజస్వి పొడపాటి, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మలను యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్ పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. *తరలివచ్చిన కవులు, రచయితలు*... మూడు రోజుల పాటు నిర్వహించే అమరావతి సాహిత్య ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలు సాహిత్యాభిమానులను ఆకట్టుకున్నాయి. వివిధ భాషల్లోని పుస్తకాలను సందర్శకులు ఆసక్తిగా పరిశీలించి, వాటి గురించి రచయితలు, సాహితీవేత్తలతో చర్చించారు.