స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యే దగ్గుపాటి కీలక భేటీ
సూర్య ,అనంతపురం బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రి సవిత, సహచర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, అనంతపురం నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, ఎన్నికలకు పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం అర్బన్ పరిధిలో మేయర్, మున్సిపల్ స్థానాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లోనూ పార్టీ బలమైన ఫలితాలు సాధించే లక్ష్యంతో పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.