స్థానిక ఎన్నికలకు సర్వసన్నద్ధం.. జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్
అమలాపురం మేజర్ న్యూస్ మున్సిపాలిటీల్లో సప్లిమెంటరీ ఓటర్ల జాబితాల రూపకల్పన, ముద్రణ, రాజకీయ పార్టీలకు పంపిణీ ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని: జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు.పోలింగ్ సిబ్బందికి శిక్షణ పోలింగ్ సిబ్బంది నియామకం, ర్యాండమైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు నిబంధనల మేరకు అదనపు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని, మైక్రో అబ్జర్వర్ల నియామకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బందికి మొదటి, రెండో విడత శిక్షణను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.
కౌంటింగ్ ఏర్పాట్లు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అమలాపురంలో 8, ముమ్మిడివరంలో 6, రామచంద్రపురంలో 6 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎంపీటీసీ విభాగాలకు అనుగుణంగా కౌంటింగ్ టేబుళ్లు, సిబ్బంది కేటాయింపులను త్వరితగతిన ఖరారు చేయాలని కలెక్టర్ సూచించారు.సమస్యాత్మక కేంద్రాలపై నిఘా:
రామచంద్రపురం మున్సిపాలిటీలోని 50 పోలింగ్ స్టేషన్లలో 15 సెన్సిటివ్, 16 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించారు. అమలాపురంలోని 71 పోలింగ్ స్టేషన్లలో 18 సెన్సిటివ్, 18 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా, ముమ్మిడివరంలోని 23 పోలింగ్ స్టేషన్లలో 7 సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.రవాణా, భద్రతా ఏర్పాట్లు
బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బంది తరలింపునకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని జిల్లా రవాణా అధికారికి సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, బారికేడింగ్ పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తపేట, రామచంద్రపురం, అమలాపురంలోని ఎస్‌కేబీఆర్ కళాశాలల్లో ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు ఫిర్యాదుల పరిష్కారానికి కంట్రోల్ రూములు, ఓటర్ హెల్ప్‌లైన్ విభాగాలను క్రియాశీలంగా ఉంచాలని, మీడియా సమాచార మార్పిడి కోసం ప్రత్యేక మీడియా కేంద్రాన్ని నిర్వహించాలని తెలిపారు.ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిపాలన అధికారి కే. నాగలక్ష్మమ్మ, జిల్లా పంచాయతీ అధికారిణి శాంతి కుమారి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ వర్మ, ఆర్ అండ్ బి ఈఈ బి రాము, డిఎంహెచ్వో ఎం దుర్గా రావు దొర, డిఆర్డి ఎ పిడి డి. రాంబాబు, సంబంధిత జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు